గత కొన్ని రోజుల నుండి Non Veg ప్రియులని వెంటాడుతున్న భయం- BIRD FLU
ఇప్పుడు ఎక్కడ చుసిన మాంసాహార ప్రియులని బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతూనే ఉంది, తినాలి అని ఉన్న తినలేని పరిస్థితి. అసలు ఏంటి ఈ బర్డ్ ఫ్లూ ? అసలు ఏంటి ఈ వైరస్ ? ఇది ఎందుకు వస్తుంది ? మనుషులకి వ్యాపిస్తుందా ? ఇది ఎప్పుడు మొదలయింది ? అనే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. మీ భయాలన్నీ పోగొట్టడానికి మరియు మీ సందేహాలన్నీ తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము.
అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి ..?
బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇంఫ్లూయెంజా అని అంటారు .ఇది H5N1 వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది .ఇది కోళ్లు ,బాతులు మరియు ఇతర పక్షి జాతులకు ఒకదాని నుండి ఇంకోదానికి సోకుతుంది.ప్రపంచం లో మొదట దీన్ని మొదట 1997 లో హాంగ్ కాంగ్ లో గుర్తించారు ,భారత దేశం లో మొదటి కేసు 2006 లో మహారాష్ట్ర లోని నావాపూర్ లో గుర్తించారు.ఇప్పుడు ఇదే బర్డ్ ఫ్లూ తెలుగు రాష్ట్రాలని గజ గజ వణికిస్తూ పౌల్ట్రీ పరిశ్రమకి తలనొప్పిగా మారింది.ఇంతటితో ఆగకుండా తెలుగు రాష్ట్రాల మధ్య వారధి లాగ 24 చెక్ పోస్ట్లు ఎరుపాట్లు చెసేలాగా విజృంభించింది.కోట్లు పెట్టి వ్యాపారం చేస్తున్న వ్యాపారులకు మాత్రం తీరని నష్టం చేకూరుస్తు కంటి మీద కులుకు లేకుండా చేస్తుంది.ఇక ముందు మనం బర్డ్ ఫ్లూ వైరస్ తగ్గించుకుంటే మరో కరోనా వైరస్ లాగ విజృభించే అవకాశాలు చాల ఎక్కువగా ఉన్నాయి అని విశ్లేషకుల అంచనా .
ఆంధ్రప్రదేశ్ కోళ్ళకి బర్డ్ ఫ్లూ ఎలా వచ్చింది ..?
ఇది అందరికి ఎప్పటికి పూర్తిగా సమాధానం లేని ప్రశ్నలాగా మిలిగిపోతుంది .కానీ అక్కడ ఉన్న అధికారుల ప్రకారం ఏలూరు జిల్లాలో ఉన్న కొల్లేరు కి ప్రతి ఏటా వలస పక్షులు వస్తూ ఉంటాయి.అవి చాలా చోట్ల తిరిగి రావడం ,కొల్లేరు లో ఉన్న నీటిలో మలవిసర్జన చేయడం వంటివి జరుగుతూ ఉంటాయి ,ఆ కలుషిత నీరుతో కోళ్ళకి బర్డ్ ఫ్లూ అనేది సోకుతుంది అని చెప్తున్నారు.
కోళ్ళకి బర్డ్ ఫ్లూ సోకినప్పుడు కనిపించే వ్యాధి లక్షణాలు.
ఇది కోళ్ళకి సోకినప్పుడు కోడి గుడ్ల పెట్టడం పూర్తిగా తగ్గిపోతుంది ,అలానే శరీరం మొత్తం సోకితే ఈకలు ఊడిపోయి కొన్ని గంటల్లోనే చనిపోతాయి.ఇప్పటివరకు ప్రపంచంలో సుమారు పది కోట్ల కోళ్ల దీని భారినపడి చచ్చిపోయాయి ,మనం దేశం లో ఎక్కువగా మహారాష్ట్ర ,కేరళ ,ఒడిశా ,ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లో ఎక్కువగా ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతూ వస్తుంది
బర్డ్ ఫ్లూ మనుషలకీ సోకుతుందా.. ?
ఇది ఎక్కువగా బర్డ్ ఫ్లూ సోకినా కోళ్ల నుండి మనిషికి సోకుతుంది.ఇది పక్షులకి ప్రాణాంతకమైన వ్యాధి. ఇది 1996లో మొదటిసారి మనుషులో గుర్తించారు.ఇప్పటివరకు మనిషి ప్రాణాలు తీసేంత తీవ్రత మాత్రం ఈ వైరస్ లో కనిపించలేదు.ఇది ఎక్కువగా దాన వేసేవాళ్ళకి లేదా రోగం వచ్చిన వాటిని తరలించే సమయం లో కోళ్ల నుండి మనిషికి వచ్చే అవాకాశాలు ఉంటాయి.సాధారణంగా బర్డ్ ఫ్లూ కోళ్ళకి వచ్చినప్పుడు ముందుగానే అలెర్ట్ అయి బ్రతికి ఉండగానే మనుషులు నివసించే ప్రదేశాలకి దూరంగా పూడ్చేయాలి కానీ ఇక్కడ ఆలా జరగడం లేదు అందువలన ఎక్కువగ వ్యాప్తి చెందడం మొదలు పెట్టింది .జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యం ఉంటె రోగం వచ్చిన కోడి నుండి మనిషికి సోకుతుంది .ఒకవేళ సోకితే ఇది సాధారణ ఫ్లూ లాగానే గొంతు నొప్పి ,దగ్గు ,జ్వరం తలనొప్పి సమస్యలు వస్తాయి.కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు లేకుండా కేవలం కంటికి మాత్రమే సోకుతుంది .మన అదృష్టం ఏంటంటే ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ల నుండి మనిషికి సోకినట్టు దాఖలాలు ఉన్నాయి కానీ ఒక మనిషి నుండి ఇంకో మనిషికి సోకినట్టు మాత్రము దాఖలాలు లేవు.
ఒక్కసారిగా పడిపోయిన కోళ్ల అమ్మకాలు..
కరోనా మహమ్మారి విజృభించిన సమయంలో చికెన్ మరియు కోడిగుడ్లు వైరస్ ని జయించడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఆంధ్రరాష్ట్రంలోని తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పౌల్ట్రీ వ్యాపారం ఎక్కువగా సాగుతుంది .అక్కడ వైరస్ సోకింది అనే విషయం బయటికి రాగానే పక్క రాష్ట్రాలు వైరస్ భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాయి.తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలో వైరస్ గురించి వార్త పత్రికల్లో రాగానే జనాలు భయపడటం మొదలు పెట్టారు ,తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాకపోయినా చికెన్ మరియు కోడిగుడ్లు తినడానికి ఎవరు ముందుకు రావట్లేదు.ఒక్కప్పుడు kg చికెన్ కి 400 రూపాయలు ఉన్న కూడా యెగపడి మరి తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు కాగ్ 150 రూపాయలకి ఇచ్చిన కూడా కొనడానికి ముందుకు రావట్లేదు.దీనితో వ్యాపారాలు తలలు బాదుకుంటూ పశుసంవర్ధక అధికారులని దీని పైన ప్రజలకి అవగాహన కలిపించాలని వేడుకుంటున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) లెక్కల ప్రకారం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం జనవరి 1 2003 నుండి ఇప్పటివరకు 248 మందికి కోళ్ల నుండి బర్డ్ ఫ్లూ సోకింది .అందులో 148 మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు,మరియు ఇందులో చివరి బర్డ్ ఫ్లూ కేసు 2023 లో చైనా లో నమోదు అవ్వడం గమనార్హం.
ఎలా తింటే సురక్షితం ..?
చాలామంది మటన్ కంటే చికెన్ మీద ఎక్కువ ఇష్టం చూపిస్తూ ఉంటారు ఎందుకంటే చికెన్ మరియు కోడిగుడ్లలో అదిక సంఖ్యలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి .కానీ ఇప్పుడు నాన్వెజ్ ప్రియులు చికెన్ అంటేనే భయపడుతున్నారు .కానీ మనం జాగ్రత్తలు తీసుకుంటే మనకి నచ్చినట్టు కడుపునిండ చికెన్ తినొచ్చు. ఇప్పుడు బర్డ్ ఫ్లూ సోకుతుంది అని మనం మర్చిపోయి నిర్లక్ష్యం తో ఉడికి ఉడకకుండ చికెన్ లేదా కోడిగుడ్లు తింటే బర్డ్ ఫ్లూ వైరస్ భారిన పడే అవకాశం లేకపోలేదు .కాబట్టి ముందుగ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే H5N1 వైరస్ కి వేడిని తట్ట్టుకునే శక్తి ఏమాత్రం ఉండదు.కాబట్టి మనం మాంసాన్ని ఎరుపు రంగు పోయేవరకు 70 డిగ్రీ సెన్సస్ లో ఉడికిస్తే వెంటనే వైరస్ చనిపోతుంది అందువల్ల మనం వైరస్ భారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు .